టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

  • గురువారం మధ్యాహ్నం బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే
  • రాత్రికే టీఆర్ఎస్ లో చేరిపోయిన బిక్షమయ్య గౌడ్
  • బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ కూడా చేరిక 
బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గంటల వ్యవధిలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మధ్యాహ్నం బిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే గురువారం రాత్రి ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. బిక్షమయ్య గౌడ్ తో పాటు బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

Telangana
TRS
BJP
Boodida Bikshamaiah Goud
KTR
Telangana Bhavan

More Telugu News